అవంతి సీ ఫ్రోజెన్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఎర్రవరం పరిసర గ్రామ ప్రజలు ధర్నా చేశారు. సంస్థ ఒత్తిళ్లతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని ఆందోళన చేశారు.
రోడ్డు కావాలి
By
Published : Mar 7, 2019, 3:40 PM IST
రోడ్డు నిర్మాణం కోసం ధర్నా
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో అవంతి సీ ఫ్రొజెన్ ఫుడ్స్ కంపెనీ వద్ద ప్రజలు ఆందోళన చేశారు. ఎర్రవరం నుంచి పెద్దనాపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాలని ధర్నాకు దిగారు. సంస్థ యజమాన్యం జోక్యంతోరహదారి నిర్మాణం నిలిచిపోయాయని ధ్వజమెత్తారు.నిరసనతో కంపెనీ బస్సులు, ప్రజా వాహనాల రవాణాకు అంతరాయమేర్పడింది.పరిస్థితిసమీక్షించిన ఏలేశ్వరం ఎస్సై అప్పలనాయుడు...సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడుతామని ఇచ్చిన హామీతో ఆందోళనకారులు నిరసన విరమించారు.