హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మోశా అలియాస్ బాబు అదే గ్రామానికి చెందిన మాలికతో గత నాలుగేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే కొన్ని రోజులుగా మాలిక పెళ్లి చేసుకుందామని అడగడంతో మొహం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించింది. అక్కడ తనకు న్యాయం జరగడం లేదని.. నిన్న రాత్రి ఏకంగా గ్రామంలోని సెల్ టవర్ ఎక్కింది. రాత్రి నుంచి అక్కడే కూర్చొని తమ ప్రేమ కోసం పోరాటం చేస్తోంది. అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడని ఆరోపించింది.
అబ్బాయి హామీ ఇస్తేనే..