రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించింది. ఈనెల 18న కులాల ప్రకారం లిస్ట్ ప్రకటించనుంది. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఎంపికచేయనుంది. ఆ విధుల్లో అనంతపురం జిల్లా కదిరి నియోవర్గంలో అధికారుల నిమగ్నమయ్యారు. ఆరు మండలాల్లో ఉన్న 56 పంచాయితీలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయి పరిశీలన - ap latest
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. అనంతపురం జిల్లాలో అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ మొదలెట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పరిశీలన
ఇవీ చదవండి...తీరు మార్చుకోండి.. వైద్యులకు ఎమ్మెల్యే హెచ్చరిక