అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు ప్రచారకర్తగా దర్శకుడు రాజమౌళి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు ప్రచారకర్తగా దర్శకుడు రాజమౌళి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి బాహుబలి చిత్రబృందంతో పాటు ప్రఖ్యాత షెఫ్ సంజీవ్ కపూర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్, మథుర ఎంపీ హేమమాలినితో పాటు కొందరు ముఖ్యమైన వ్యక్తులు హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమంలో 20 మంది పేద విద్యార్థులకు ప్రధాని ఆహారం వడ్డించనున్నారు. దీంతో అక్షయ పాత్ర తరఫున 300కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ చేసిన ఘనత సాధిస్తుందని ఇస్కాన్ ప్రధాన వ్యూహకర్త నవీన నీరదా దాస తెలిపారు. ఈ రికార్డుకు గుర్తుగా అక్కడి చంద్రోదయ మందిర్‌లో ప్రధాని మోదీ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.
"ఎస్ఎస్ రాజమౌళి మాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నారు. కానీ ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలోని కొందరు సభ్యులు పాల్గొంటారు"-- నవీన నీరదా దాస