ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'పాక్​కు భారత్​ గట్టి వార్నింగ్' - పాక్​

జమ్ము ఉగ్రదాడిపై పాక్​కు తీవ్ర హెచ్చరికలు పంపింది భారత్​. ఉగ్రవాద సంస్థలపై నిషేధానికి ప్రపంచదేశాల మద్దతు కోరింది భారత విదేశాంగ శాఖ.

'పాక్​కు భారత్​ గట్టి వార్నింగ్'

By

Published : Feb 15, 2019, 6:46 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపై గట్టి చర్యలు తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది భారత్​. ఇందులో భాగంగానే ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రపంచదేశాలను కోరింది.

జమ్ము దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ జైష్​ ఏ మహమ్మద్​(జేఈఎం) చీఫ్​ మసూద్​ అజార్​తో పాటు ఇతర పాక్​ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వర్తించే సంస్థలపై గట్టి చర్యలు తీసుకునే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి-1267 ఆంక్షల ప్రకారం వీరిపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది భారత్​.

జేఈఎం చీఫ్​ మసూద్​ అజార్​కు పాకిస్థాన్​ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. భారత్​తో పాటు ఇతర దేశాల్లోనూ ఇష్టారీతిలో ఉగ్రదాడులు చేస్తున్నారని తెలిపింది.

మా ప్రమేయం లేదు: పాక్​

దీనికి ప్రతిస్పందించిన పాక్​ విదేశాంగ శాఖ... దర్యాప్తు లేకుండా తమను దోషులుగా పేర్కొనడం సరికాదని ప్రకటన విడుదల చేసింది. ఇందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details