వీరజవాన్లకు తెదేపా నివాళి - tdp politburo
పుల్వామా దాడి ఘటనపై తెదేపా పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వీరజవాన్ల ఆత్మకు శాంతి కలగాలంటూ రెండునిమిషాలు సభ్యులు మౌనం పాటించారు.

సుదీర్ఘ విరామం తర్వాత తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది.రాష్ట్ర,జాతీయ రాజకీయాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. పార్టీ విధివిధానాలపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై చర్చించనున్నారు.తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అంశంపై పొలిట్‌బ్యూరోలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.వలసలు,చేరికలపై ప్రస్తావించనున్నారు.ఎమ్మెల్యె టిక్కెట్లు ఆశిస్తోన్న ఎమ్మెల్సీల గురించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.సోమిరెడ్డి ఫార్ములాపై పొలిట్‌బ్యూరోలో మంతనాలు జరుపనున్నారు.హోదా,విభజన హామీల అమలు ఉద్యమాలపై ప్రస్తావించనున్నారు.సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ప్రణాళికల రూపొందించనున్నారు.మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.అమరావతిలో జరపనున్న ధర్మపోరాట సభపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.