తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ప్రారంభ దర్శనంలో నిర్వహించిన అభిషేకం సేవలో పాల్గొన్నారు. తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రితోపాటుగా రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు.
తిరుమల సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి - piyush goyal
తిరుమలలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రారంభ సేవలో పాల్గొనేందుకు తితిదే అధికారులు ప్రత్యేక ఏర్పట్లు చేశారు.
తిరుమల సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి