ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా? - అరెస్టు

విస్మయపరిచిన ముంబయి పాఠశాల బస్సు డ్రైవర్​ నిర్వాకం.

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా

By

Published : Feb 9, 2019, 12:08 AM IST

Updated : Feb 9, 2019, 9:00 AM IST

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా
పాఠశాల బస్సుల ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదం జరిగాకే అధికారులు చర్యలు చేపట్టినట్టు హడావిడి చేస్తారు. కొద్ది రోజులకు మర్చిపోతారు. ఏమాత్రం జాగ్రత్త వహించకుండా ఎన్నో పాఠశాలలు ఇప్పటికీ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.

తాజాగా ముంబైలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకం విస్మయానికి గురిచేస్తోంది. గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను ఉపయోగించి బస్సును నడిపాడు సదరు డ్రైవర్​. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా

ఆ వెదురు కర్రనే గేర్​ రాడ్డు స్థానంలో వాడుతూ బస్సుతో బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. బస్సును వెంబడించి పట్టుకున్న కారు డ్రైవర్​ గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను చూసి అవాక్కయ్యాడు. డ్రైవర్​ రాజ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరమ్మతుకు సమయం లేకపోవడం వల్లే కర్రతో బస్సు నడుపుతున్నట్టు డ్రైవర్​ వివరించాడు. మూడేళ్లుగా ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది.

Last Updated : Feb 9, 2019, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details