ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ట్రైన్ మాక్స్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

ట్రైన్ మాక్స్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వ నిలుపుదల చేయడానికి నిరాకరించింది. ఏదానా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తే అప్పుడు సవాలు చేసే వీలుందని ట్రైమాక్స్​ సంస్థకు వెసులుబాటు ఇచ్చింది.

By

Published : Jun 14, 2019, 8:18 AM IST

ట్రైన్ మాక్స్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

శ్రీకాకుళం జిల్లాలో బీచ్ శాండ్ ఖనిజం తవ్వకాల విషయమై గతంలో ఇచ్చిన అనుమతిలోని కొంత విస్తీర్ణానికి... కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉపసంహరించుకోవడాని సవాలు చేస్తూ ట్రైన్ మాక్స్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది. కేంద్ర ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులను సవాలు చేసుకోవడానికి ట్రైమాక్స్ సంస్థకు వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఏం. సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ట్రైమాక్స్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతులు ఉపసంహరించుకునే ముందు కేంద్ర ప్రభుత్వం తమకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ బీచ్ శాండ్​ను శాస్త్రీయ పరిశోధనకు,రక్షణ అవసరాలకు వినియోగిస్తారు. వ్యాపార అవసరాలకు వినియోగానికి ఇచ్చిన లీజులు రద్దు అవుతాయన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేయడానికి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే సవాల్ చేసుకోవడానికి ట్రైమాక్స్ సంస్థకు వీలు కల్పించింది.

ట్రైన్ మాక్స్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

ABOUT THE AUTHOR

...view details