ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి - జారిపడిన వ్యక్తికి తీవ్రగాయాలు

టెక్కలి రైల్వేస్టేషన్​లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

వ్యక్తికి తీవ్రగాయాలు

By

Published : Mar 26, 2019, 6:40 PM IST

వ్యక్తికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్​లో విశాఖ ఎక్స్​ప్రెస్ రైలు ఎక్కుతూ... భరత్ అనే ప్రయాణికుడు జారిపడిపోయాడు. కదులుతున్న రైలు ఎక్కబోతుండగా జారిపడిన భరత్ ప్లాట్​ఫామ్ కిందపడిపోయాడు. ఆ సమయంలో రైలు కదలికలో ఉండడం వలన భరత్ కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.క్షతగాత్రుడ్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. టెక్కలిలోని అత్తారింటికి వచ్చిన భరత్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details