కడప జిల్లా అలంఖంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపడుతుండగా వెంకట నాగారాజా అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు మృతుడి కుటుంబానికి అందాల్సిన చంద్రన్న బీమా డబ్బులను తక్షణమే మంజూరు చేశారు. అయితే అకస్మాత్తుగా పోలీసులు తుపాకులతో ఇంట్లోకి రావడంతోనే నాగారాజా మృతి చెందాడంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తనిఖీలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి
కడప జిల్లా అలంఖంపల్లిలో పోలీసుల తనిఖీలతో గాబరాపడి ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తుపాకులతో వచ్చిన పోలీసులను చూడటం వల్లే గుండెపోటు వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తనిఖీల్లో వ్యక్తి మృతి