పెంపుడు శునకాలతో అతివల హొయలు... న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో ఓ వింత ఫ్యాషన్ పరేడ్ జరిగింది. అందంగా ముస్తాబు చేసిన కుక్కల్ని పట్టుకుని వయ్యారంగా హొయలొలికించారు ముద్దుగుమ్మలు. ఫ్యాషన్ డిజైనర్ ఆంటోని రూబియో ఏర్పాటు చేసిన ఈ వింత ఫ్యాషన్ పరేడ్‌లో కుక్క పిల్లల్ని సుకుమారంగా పట్టుకుని ఈజిప్ట్, లాటిన్ అమెరికా, భారత వస్త్రధారణలో క్యాట్‌వాక్ చేసి హుషారెక్కించారు మోడల్స్.
జంతు సంరక్షణ, పెంపుడు జంతువుల జనాభా నియంత్రణపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆంటోని.