ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నాడో సినీ కవి. ఆ తర్వాత ఒక్కసారి ప్రేమించు చూడు అన్నాడు మరో కవి...వెంటనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నాడు ఇంకో కవి...సినీ రచయితల ప్రతీ పాటకు సమాజం ప్రభావితమవుతోంది...ప్రేమ అనే పరీక్ష రాయడం.. ఫెయిల్ అవ్వడం లేదా పాసవడం...అంతటితో ఆగకుండా సినీకవి చెప్పిన మాటలను విని...సంసార సాగరాన్ని ఈదడం కన్నా ఒంటరిగా మిగలడమే మిన్నా అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు...నేటి తరం యువత.
సృష్టిలో రెండక్షరాల ప్రేమకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కానీ మారుతున్న కాలం, పెరుగుతున్న పాశ్చాత్య పోకడల వల్ల ఆ పదాలకు అర్థాలు మారిపోతున్నాయి. సినిమాలు సైతం ప్రేమ మత్తును సమాజంపై బాగానే వెదజల్లుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపే. లోతుగా పరిశీలించి చూస్తే మరో కోణం కన్పిస్తుంది. అదే ఏక్ నిరంజన్.