గవర్నర్ నరసింహన్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు... ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. స్పీకర్ కోడెల తన చొక్కా తానే చింపుకొని రాద్ధాంతం చేశారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని అన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల బాధ్యతలను కేంద్రానికి అప్పగించాలని గవర్నర్ ను కోరారు. కేంద్ర బలగాలను మరింతగా రాష్ట్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్ట్రాంగ్రూముల భద్రతను కేంద్రానికి అప్పగించాలి: జగన్ - jagan on babu
వైకాపా అధ్యక్షుడు జగన్... గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడారు.
jagan