ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాజధానిగా విశాఖను ఎంపిక చేయాల్సింది: పవన్

భూ కబ్జాలు అడ్డుకుని... విశాఖ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. విశాఖ అక్కయ్యపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్న పవన్... వైకాపా, తెదేపా నేతలపై విరుచుపడ్డారు. తనను తాను ఓ వ్యవస్థగా అభివర్ణించుకున్నారు.

By

Published : Apr 4, 2019, 3:53 PM IST

pawan_vishaka

అక్కయ్యపాలెంలో ఎన్నికల ప్రచారంలో పవన్
రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా అని భాజపా నేతలు మోసం చేశారన్న పవన్‌ కల్యాణ్...మోదీ, అమిత్‌ షా అంటే జగన్‌కు చాలా భయమన్నారు. అందుకే ప్రత్యేకహోదా, రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై మాట్లాడరన్నారు. జగన్ ప్రజాదరణ... డబ్బు ఇచ్చి కొనుక్కుంటే వచ్చిందని విమర్శించారు. మార్పు కోసమే ముందుకొచ్చానని తెలిపిన పవన్‌...ఓటుతోనే రాష్ట్ర ప్రజలు బాగుండాలని సూచించారు. తనను యాక్టర్‌ అని విమర్శిస్తున్న జగన్... ఎందుకు నటులను వారి పార్టీలోకి చేర్చుకున్నారని ప్రశ్నించారు. విశాఖను రాజధాని చేసి ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేవన్నారు. విశాఖలో జరిగే అక్రమాలను అడ్డుకుని..అభివృద్ధికి జనసేన కృషి చేస్తుందని జనసేనాని స్పష్టం చేశారు..

ABOUT THE AUTHOR

...view details