తిరుపతి బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి పాల్గొన్న పవన్ వైకాపా, తెదేపా నేతలకు స్వస్తి పలికి... మార్పుకు తిరుపతి నుంచే శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మార్పు రాకుంటే సామాన్యులను బతకనివ్వరని హెచ్చరించిన జనసేనాని... భావితరాలకు అండగా ఉంటారనే చదలవాడ కృష్ణమూర్తిని నిలబెట్టామన్నారు.కరుణాకర్‌రెడ్డి లాంటి నేతల కింద బానిసలుగా బతికే రోజులు కావని స్పష్టం చేసిన పవన్...వాళ్లు కత్తులు పట్టుకుంటే ప్రజాస్వామ్యవాదులైన జనసేన సైనికులు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రత్యేకహోదాను అడ్డుకునే కేసీఆర్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై భాజపా, వైకాపా, తెదేపాఅనేక నాటకాలు ఆడినా...మాయావతి పూర్తి మద్దతు తెలిపారనిప్రశంసించారు.