ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

''మాయావతే ప్రధాని... పవనే ముఖ్యమంత్రి'' - మీడియా

మాయావతి ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని మాయా వ్యక్తం చేశారు.

మాయావతి, పవన్ మీడియా సమావేశం

By

Published : Apr 3, 2019, 1:45 PM IST

మాయావతి, పవన్ మీడియా సమావేశం
బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి.. పనిచేస్తుండడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆనందంగా ఉన్నారు. దశాబ్దకాలంగా బీఎస్పీ నేతలతో తాను టచ్​ లో ఉన్నట్టు చెప్పారు.మాయావతి ఎన్నో సవాళ్లను అధిగమించారని పవన్ గుర్తు చేశారు.దళితుడు సీఎం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగిందన్న పవన్.. ఆవాగ్దానాన్ని కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు.దళితుడుఓ రాష్ట్రానికి సీఎం కాలేకపోయినా.. దేశానికి మాత్రంప్రధాని అయ్యే అవకాశం ఉందని మాయావతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. అభివృద్ధి జరగలేదని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు.అభివృద్ధి జరగకపోవడంతోనే తెలంగాణ రాష్ట్రం కోసంఉద్యమం చేశారని తెలిపారు.రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదన్నారు.ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోదీ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడవద్దని సూచించిన మాయావతి...ఏపీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. పవన్‌ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్‌తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. జనసేన కూటమి అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని... పవన్‌కల్యాణ్‌ సీఎం అవుతారని ధీమాగా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details