ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం?: పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో వివిధ జిల్లాల నేతలతో నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

సార్వత్రిక ఫలితాలపై పవన్ సమీక్ష

By

Published : Jun 6, 2019, 7:23 PM IST

సార్వత్రిక ఫలితాలపై పవన్ సమీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవానికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమీక్షలు ప్రారంభించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. నాగబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై ఆరా తీసిన పవన్.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీ బలం పుంజుకోవాలన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. మరో మూడు రోజుల పాటు అన్ని జిల్లాల నేతలతో పవన్ సమావేశమవనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details