'జనసేనతో కొత్త రాజకీయ శకం ఆరంభం' - పవన్ కల్యాణ్
2019 సార్వత్రిక ఎన్నికల రసవత్తర పోరులో నువ్వా-నేనా అంటూ తలపడుతున్న అధికార తెదేపా- ప్రతిపక్ష వైకాపాలను జనసేన ఢీ కొట్టబోతుంది. వామపక్షాలు, బీఎస్పీతో జతకట్టి బరిలో దిగుతున్న జనసేన వ్యూహ ప్రతివ్యూహాలపై రచిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
జనసేనాని పవన్ కల్యాణ్
జనసేన రాకతో కొత్త రాజకీయ శకం ఆరంభం ఖాయమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత.. జనసేన మౌలిక సూత్రాలుగా చెప్పారు. రాజకీయాల్లో సుస్థిరత కోసం కిందటి ఎన్నికల్లో తెదేపాకు మద్దతు ఇచ్చిన తాము... ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి.... అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Last Updated : Mar 22, 2019, 7:06 AM IST