'కేసీఆర్ ఆంధ్రాకు వచ్చి పోటీచేయాలి' - ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప...రాజకీయా జోక్యాల్లో కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వ్యవహారంపై పవన్ అభిప్రాయం ఆయన మాటల్లోనే...
రాజకీయాల కోసం రెండు ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైంది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీతో ఉన్న విభేదాలతో తెరాస ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని అన్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. సామాన్యులకు సీట్లు ఇచ్చి సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతున్నామని చెప్పారు. మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసం సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. జనసేన ఎవరి పక్షం కాదని ఏది సరైనదో అదే మాట్లాడుతామని స్పష్టం చేశారు.