గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కల్యాణ్ పర్యటించారు. వడదెబ్బ కారణంతో ఇవాళ ఉదయం నుంచి ప్రచారానికి విరామం ఇచ్చిన పవన్ సాయంత్రం తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ప్రచారంలో మాట్లాడిన పవన్..తెదేపా నాయకుల్లా భూకబ్జాలు చేయడానికి కాకుండా ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యవస్థను నాశవం చేసే పార్టీలను తరిమికొట్టాలని పిలుపిచ్చారు. జనసేన నినాదమే కులాల ఐక్యత అని గుర్తుచేశారు. ప్రజల్లో కులాలు, మతాల పేరిట గొడవలు పెడితే ఊరుకోనని హెచ్చరించారు.
కులాల ఐక్యతే.. జనసేన నినాదం: పవన్‌కల్యాణ్ - janasena
గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కల్యాణ్ పర్యటించారు. వడదెబ్బ కారణంతో ఇవాళ ఉదయం నుంచి ప్రచారానికి విరామం ఇచ్చిన పవన్ సాయంత్రం తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు

తెనాలి రోడ్ షోలో పవన్
తెనాలి రోడ్ షోలో పవన్
ప్రచారం కోసం వచ్చిన పవన్ చేతికి సెలైన్ ఎక్కించే సూది అలాగే ఉంది. ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో విశ్రాంతి మధ్యలోనే పవన్ ప్రచారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి :ఓటర్లను 'ఫిదా' చేసేందుకు 'మిస్టర్' వరుణ్ ప్రచారం
Last Updated : Apr 7, 2019, 12:02 AM IST