నేడు విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనునన్నారు. గాజువాక నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారి నగరానికి వస్తున్న పవన్ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 10 గంటలకు జనసేనాని విశాఖ చేరుకుంటారు. అనంతరం గాజువాకలో నామినేషన్ వేస్తారు. పాతగాజువాకలో జరిగే బహిరంగ సభకు పవన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఆనందపురం మార్కెట్, సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్, ఓల్డ్ జైల్ రోడ్డులో పవన్ ప్రచారం చేయనున్నారు. రేపు భీమవరంలో పవన్ నామినేషన్ వేయనున్నారు.
నేడు గాజువాకలో పవన్- రేపు పులివెందులలో జగన్ - ap elections 2019
వైకాపా, జనసేన అధినేతలు నామినేషన్ పర్వానికి సిద్ధమయ్యారు. నేడు పవన్ గాజువాకలో, రేపు.. జగన్ పులివెందులలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
వైకాపా, జనసేన అధినేతలు నామినేషన్లు
రేపు కడప జిల్లా పులివెందులలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అనంతరం పులివెందులలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. మేనిఫెస్టో తుదిరూపు కోసం నేడు జగన్ మేనిఫెస్టో కమిటీతో భేటీకానున్నారు.