ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో హాని లేదు :మోదీ - పౌరసత్వ చట్ట సవరణ బిల్లు

సొంత ప్రయోజనాల కోసమే కొంతమంది అసత్యవార్తలు వ్యాపింపజేసి అసోంలో గందరగోళం సృష్టిస్తున్నారని అసోం ర్యాలీలో ఆరోపించారు ప్రధాని మోదీ.

మోదీ, ప్రధానమంత్రి

By

Published : Feb 9, 2019, 7:07 PM IST

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి హాని కలగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముమ్మర దర్యాప్తు, రాష్ట్రపతి సిఫార్సులు అందిన తర్వాతే పౌరసత్వం అందిస్తామని గువాహటిలో నిర్వహించిన ర్యాలీలో మోదీ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ప్రధాని.

"ఎన్​ఆర్​సీతో పాటు నాగరికతకు సంబంధించిన చట్టంపై అసత్యాలు వ్యాపిస్తున్నాయి. దేశాన్ని ఇన్నేళ్లు నాశనం చేసినవారు తమ సొంత లాభాలకోసం వీటిని వ్యాపింపజేస్తున్నారు. అసోం సహా ఈశాన్య భారతీయుల భాష, సంస్కృతి, ఆశలను కాపాడటానికి భాజపా, ఎన్​డీఏ సర్కారు అన్ని విధాలుగా కట్టుబడి ఉంది."
---నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

గోపినాథ్​ బొర్దొలొయ్​, భూపెన్​ హజారికలకు భాజపా ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసినవారిని గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లు విస్మరించాయని మోదీ ఆరోపించారు.

"కొంతమందికి పుట్టినప్పుడే భారతరత్న ఖరారయిపోతుంది. దేశ మర్యాద కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించడానికి మాత్రం ఎన్నో ఏళ్లు గడిచిపోతోంది. దీనికి సమధానం కావాలని దేశమంతా అడుగుతోంది."
---నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

పొరుగు దేశాల మైనారిటీలకూ ఆశ్రయం కల్పింస్తామన్ని తమ మాటపై కట్టుబడి ఉంటామని ప్రధాని తెలిపారు. భారతదేశంపై మక్కువ పెరిగి ఇక్కడ నివసిస్తున్నారని మోదీ స్పష్టం చేశారు.

అసోంను నూనే, గ్యాస్​ హబ్​లు​గా మారుస్తామన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. గత నాలుగేళ్లలో 14వేల కోట్ల విలువగల ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details