ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెలుగుదేశం విజయం... అభివృద్ధికి పట్టం: శ్రీరాం - పరిటాల శ్రీరామ్

రాప్తాడు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ... తల్లి బాటలో నడుస్తున్నారు పరిటాల శ్రీరాం. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ... అభివృద్ధికాంక్షించేవారు తెదేపాను తప్పక గెలిపించాలని కోరారు.

పరిటాల శ్రీరామ్

By

Published : Mar 21, 2019, 7:39 AM IST

పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా అభివృద్ధి పనులే తనకు విజయాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరాంధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో శ్రీరాంముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. సీకే.పల్లి మండలంలోని కన్నముక్కులలో ప్రచారానికి వెళ్లిన శ్రీరాంను ప్రజలు ఘనంగా స్వాగతించారు.మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యపరిష్కరించడానికి కృష్ణా నీటిని, ఇంటింటికీ కులాయి ద్వారా అందిస్తామన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.పోలింగ్ తేదీ సమీపిస్తుండం వలన ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన పరిటాల శ్రీరామ్, రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రామాల్లో పర్యటిస్తూ, తెదేపాను గెలిపించవలసినదిగా కోరుతున్నారు. సైకిల్ గుర్తుకు ఓటువేసి అభివృద్ధిని ఆహ్వానించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details