36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ సంస్థ డసోతో కేంద్రం చేసుకున్న ఒప్పందంపై ఏడాది కాలంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. రఫేల్‌లో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ రఫేల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రిషి రఫేల్ ఒప్పంద సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారని, రఫేల్ ఆడిటింగ్ నుంచి ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కాగ్‌పై కపిల్ సిబల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. యూపీఏ పదేళ్ల పాలనలో ఉన్నా, ఆర్థిక శాఖలోని సీనియర్ కార్యదర్శికే ఆర్థిక శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సిబల్‌కు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు.
2014 అక్టోబర్ 24 నుంచి 2015 ఆగస్టు 30 వరకు రాజీవ్ మెహ్రిషి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారని సిబల్ తెలిపారు. అలాగే ఏప్రిల్ 10, 2015న పారిస్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రఫేల్ ఒప్పందం చేసుకున్న సమయంలోనూ రాజీవ్ ఆర్థిక శాక కార్యదర్శిగా ఉన్నట్లు తెలిపారు సిబల్.