ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేడు దిల్లీలో భాజపాయేతర పక్షాల సమావేశం - చంద్రబాబు దిల్లీ పర్యటన

ఈవీఎంల వివాదం, ఎన్నికల్లో పారదర్శకతపై నేడు దిల్లీలోని కాన్​స్టిట్యూషన్ క్లబ్​లో భాజపాయేతర పక్షాల నేతలు సమావేశం కానున్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నారు.

దిల్లీలో ప్రతిపక్షాల భేటీ

By

Published : Apr 13, 2019, 10:31 PM IST

Updated : Apr 14, 2019, 2:45 AM IST

రాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు.. నేడు దిల్లీలో మరో కీలక సమావేశానికి హాజరు కానున్నారు. దిల్లీలోని కాన్​స్టిట్యూషన్ క్లబ్​లో ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు భాజపాయేతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ భేటీలో చంద్రబాబు కీలకం కానున్నారు. ఈవీఎంల వివాదం, ఎన్నికల్లో పారదర్శకతపై చర్చించనున్నారు. అనంతరం.. భవిష్యత్ కార్యాచరణను పార్టీల నేతలు వివరిస్తారు.

Last Updated : Apr 14, 2019, 2:45 AM IST

ABOUT THE AUTHOR

...view details