మోదీ ప్రభుత్వం దిగజారుడుతనాన్ని పుస్తకాల్లో రాయొచ్చని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలమైందని ఫేస్బుక్ వేదికగా ఆరోపించారు. మహాకూటమితో పోటీపడలేకే విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ఉబర్ వాహన ఛోదకుడిపై ఓ పత్రిక ప్రచురించిన కథనం ఆధారంగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిచారు రాహుల్. ఓలా, ఉబర్ సంస్థలు 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టించాయన్న నీతిఆయోగ్ నివేదికపై ఆ వాహన ఛోదకుడు విరుచుకుపడిన విధానాన్ని ఉటంకించారు రాహుల్.
నిరుద్యోగం అంతకంతకు పెరుగుతోంది: రాహుల్ - నిరుద్యోగం
ఉద్యోగాల సృష్టిలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రాహుల్. ఫేస్బుక్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగ రేటు అంతకంతకు పెరుగుతోందని ఆరోపించారు.
రాహుల్
రెండు కోట్ల ఉద్యోగాల్ని సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ హామీని నెరవేర్చలేకపోయారని రాహుల్ దుయ్యబట్టారు. కేంద్రం ఉద్యోగ కల్పనలో విఫలమైన కారణంగా పనిని వెతుక్కునేందుకు నిరుద్యోగులు ఎంతో శ్రమపడుతున్నారన్నారు.
2017-18 ఆర్థిక సంవత్సరానికి 6.1గా నిరుద్యోగ రేటు నమోదైందని, ఇలాంటి గణాంకాలు రావడం 45 ఏళ్లలో ఇదే ప్రథమమన్న జాతీయ గణాంక సంస్థ నివేదికను ఈ సందర్భంగా గుర్తు చేశారు రాహుల్.