ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అమీర్​పేట టు హైటెక్​సిటీ మెట్రో సర్వీస్ నేటి నుంచే...

హైదరాబాద్‌వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గవర్నర్ నరసింహన్​ అమీర్​పేటలో జెండా ఊపి సేవలు ప్రారంభిస్తారు. మొత్తం 56 కిలోమీటర్లతో మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

నేడే అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో ప్రారంభం

By

Published : Mar 20, 2019, 8:51 AM IST

నేడే అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో ప్రారంభం
నేటి నుంచి అమీర్​పేట నుంచి హైటెక్​సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు అమీర్​పేట స్టేషన్​లో గవర్నర్ నరసింహన్​ జెండా ఊపి మెట్రో సేవలు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణ సేవలు అందించనున్నారు.

10 కిలోమీటర్ల దూరం:

ఈ మార్గంలోని రైళ్లు అమీర్​పేట నుంచి మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈ రెండు స్టేషన్​ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

9 నుంచి 12 నిమిషాల మధ్య:

అమీర్​పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తైన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్​బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్​పేట్​లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

56 కిలోమీటర్ల మెట్రో మార్గం:

హైదరాబాద్​లో 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్- ఎల్​బీనగర్, 17 కిలోమీటర్ల నాగోల్- అమీర్​పేట మార్గాల్లో ఇప్పటికే మొదలయ్యాయి.10 కిలోమీటర్ల అమీర్‌పేట- హైటెక్​సిటీ మార్గంలో సేవలు ప్రారంభమైతేమొత్తం 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతుంది.

ABOUT THE AUTHOR

...view details