ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు - bombs
శ్రీకాకుళం జిల్లాలో నాటుంబాబు పేలి ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం యాతపేటలో నాటుబాంబులు పేలాయి. పెద్ద పెద్ద శబ్ధాలు రావటంతో చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు శ్రీకాకుళం రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.