ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే కోర్సులు - national-tribal-university-admissions

రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది నుంచి కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

national-tribal-university

By

Published : Apr 22, 2019, 4:44 PM IST

గిరిజన విశ్వవిద్యాలయంలో ఈఏడాది నుంచి కోర్సులు..
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. 500కు పైగా ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం మెంటార్​గా వ్యవహరిస్తోందని ఉప కులపతి ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు. రానున్న ఏడేళ్లకుగాను సంపూర్ణంగా ప్రాజెక్ట్ రిపోర్టును నిపుణుల ఆధ్వర్యంలోని ఒక కమిటీ తయారు చేస్తుందని అన్నారు.

అమర్ కంటక్​లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీతో కలిసి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని వీసీ నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుల సమర్పణకు మే 16 చివరి తేదీగా నిర్ణయించామన్నారు. అలాగే మే 24 హాల్ టికెట్స్ డౌన్​లోడ్​ చేసుకోవాలని.. జూన్ 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పీజీ కోర్సులకు 20 సీట్లు, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 30 మంది విద్యార్థులను తీసుకుంటామని తెలిపారు. ఇవి కాకుండా ఉపాధి శిక్షణ సర్టిఫికెట్ కోర్సులు కూడా నిర్వహించి ..శిక్షణ తరువాత వారికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు ప్రారంభింపచేసే దిశగా తాము ప్రయత్నిస్తామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details