జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రమూకలు మరోసారి ఘాతుకానికి తెగబడ్డాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళుతున్న వాహన శ్రేణిపై ఉగ్రవాదులు శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో42 మంది జవాన్లు చనిపోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతి పెద్దదని అధికారులు తెలిపారు.
ఈ దాడి తామే చేశామని ప్రకటించింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
సెలవులకు వెళ్లి వస్తూ..విషాదం
సీఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాల్లో ప్రయాణిస్తుండగా పేలుడు పదార్థాలతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ వాహనాల్లో మొత్తం 2500 మందికి పైగా జవాన్లు ఉన్నారు. వీరిలో చాలా మంది సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరుకావడానికి వస్తున్నారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై వెళుతున్న జవాన్ల వాహనాలు అవంతిపొరలోని లోటోమోడి ప్రాంతం వద్దకు చేరుకోగానే ఉగ్రవాదులు బాంబులతో నిండిన వారి వాహనాలతో దాడికి తెగబడ్డారు.
దాడి తీరు
జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని బాంబులతో కూడిన వాహనంతో ఢీకొట్టి ఘాతుకానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. కాల్పులు కూడా జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
జైషేనే దోషి
కాక్రపరాకు చెందిన అదిలీ అహ్మద్ బాంబులతో నిండిన వాహనాలను నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఇతను 2018లో జెయిమ్లో చేరాడు. ఘటనకు తామే బాధ్యులమని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. వీడియోను విడుదల చేసింది.
పూర్తిగా ధ్వంసమైన బస్సు