ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కల్తీ సారాకు 34 మంది బలి - నాటుసారా

నాటుసారా... ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లో తీరని విషాదం మిగిల్చింది. మృతుల్లో అనేక మంది బంధువులే కావడం మరింత దిగ్భ్రాంతికరం.

కల్తీ సారాకు 34 మంది బలి

By

Published : Feb 9, 2019, 6:22 AM IST

కల్తీ సారాకు 34 మంది బలి
ఉత్తరాఖండ్ హరిద్వార్​ పరిధిలోని బలూపూర్​ గ్రామంలో విషాదకర సంఘటన జరిగింది. ఆ గ్రామంలో కల్తీ సారా తాగి, రెండు జిల్లాలకు చెందిన 34 మంది మృతి చెందారు. మరో 40 మంది అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తమ బంధువు పెద్దకర్మ సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమానికి అనేక మంది హాజరయ్యారు. నాటుసారా సేవించి, వెంటనే అస్వస్థత పాలయ్యారు. 16 మంది బాలూపూర్​ గ్రామంలోనే మృతి చెందారు. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్​లోని షహరాన్​పూర్​లో మరో 18మంది చనిపోయారు.

షహరాన్​పూర్​లో చనిపోయిన 18మంది మృతుల్లో తొమ్మిది మంది మాత్రమే బలూపూర్​లో నాటుసారా సేవించారని ఉత్తరాఖండ్​ పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్​లోని బాలూపూర్​లో నాటు సారా విక్రయించిన వ్యక్తే ఉత్తరప్రదేశ్​లో షహరాన్​పూర్​లో అమ్మినట్టు అధికారులు భావిస్తున్నారు.

27మందిపై వేటు

ఘటనపై విచారణకు ఆదేశించాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. సిబ్బంది, పోలీసులు మొత్తం 17 మందిని సస్పెండ్​ చేసింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం. 10 మంది పోలీసులను విధుల నుంచి తప్పించింది యూపీ సర్కారు.

ABOUT THE AUTHOR

...view details