ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ముమ్మారు తలాక్​పై మళ్లీ దుమారం - సుష్మితా దేవ్​

ముమ్మారు తలాక్​పై మరోసారి కాంగ్రెస్​-భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తలాక్​ చట్టాన్ని రద్దు చేస్తామన్న మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలి వ్యాఖ్యలతో మాటల చిచ్చు ప్రారంభమైంది.

ముమ్మారు తలాక్​పై కాంగ్రెస్​-భాజపా మధ్య మాటల యుద్ధం

By

Published : Feb 8, 2019, 7:43 AM IST

ముమ్మారు తలాక్​ చట్టంపై మరో మారు రాజకీయ దుమారం రేగింది. లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ముమ్మారు తలాక్​ చట్టాన్ని రద్దు చేస్తామని మైనార్టీ సదస్సులో అఖిల భారత మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ అన్నారు​. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

" ముమ్మారు తలాక్​ చట్టాన్ని మేం వ్యతిరేకించాం. ఎందుకంటే మోదీ దీన్ని ఆయుధంగా తీసుకొచ్చారు. ఆ ఆయుధాన్ని ముస్లిం పురుషులను జైళ్లలో పెట్టడానికి, పోలీస్​ స్టేషన్లలో నిలబెట్టడానికి వినియోగించనున్నారు. దేశనలుమూలల నుంచి కోట్లాది మంది ముస్లిం మహిళలు తలాక్​ చట్టానికి వ్యతిరేకంగా లేఖలు రాశాలు. ఉద్యమం చేశారు. కాంగ్రెస్​ పార్టీ వారి స్వరాన్నే పార్లమెంటులో వినిపించింది. నేను హామీ ఇస్తున్నా. 2019లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేం ముమ్మారు తలాక్​ చట్టాన్ని రద్దు చేస్తాం. కానీ మహిళల సాధికారత కోసం ఏ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా కాంగ్రెస్​ పార్టీ మద్దతిస్తుంది."

-- సుష్మితా దేవ్​, మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు

ముమ్మారు తలాక్​పై కాంగ్రెస్​-భాజపా మధ్య మాటల యుద్ధం
సుప్రీంనే ధిక్కరిస్తారా..

సుష్మితా దేవ్​ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర. కాంగ్రెస్​ పార్టీని ముస్లిం మహిళలు, దేశ ప్రజలు క్షమించరంటూ విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరిస్తారా అంటూ రాహుల్​ గాంధీని ప్రశ్నించారు.

"ముమ్మారు తలాక్​ చట్టంపై రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీ వైఖరిని దేశం గమనిస్తోంది. ఇష్టమొచ్చిన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తే సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోబోమని చెబుతున్నారు. ఆర్డినెన్స్​ను రద్దు చేస్తామంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరిస్తూనే ప్రధాని మోదీ ముమ్మారు తలాక్​ బిల్లును తెచ్చారు. "

-- సంబిత్​ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details