రండి బాబూ రండి.. పండ్లు కొనండి.. ఓటేయండి! - galla
గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పండ్లు, కూరగాయలు, చెరుకు విక్రయిస్తూ.. ఓటర్లను ఆకర్షించారు గల్లా.

గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. లాలాపేట సెంటర్లోని పండ్లు, కూరగాయల మార్కెట్లో పర్యటించిన గల్లా.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు . పండ్లు, కూరగాయలు, చేపలు విక్రయిస్తూ.. ఓటర్లను ఆకర్షించారు. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ కోసం అధునాతన సదుపాయాలతో పక్కా భవనాలు నిర్మించి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్... గల్లాతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.