ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీ చందా రూ.1000 - దీన్​ దయాల్​

భాజపాకు నమో యాప్​ ద్వారా రూ.1000 చందా ఇచ్చారు నరేంద్ర మోదీ.

మోదీ, ప్రధానమంత్రి

By

Published : Feb 11, 2019, 10:41 AM IST

రాజకీయాల్లో మరింత పారదర్శకత కోసం ప్రధాని నరేంద్ర మోదీ 'సమర్పణ్​ దివస్​' ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతీయ జన సంఘ్​ నాయకుడు దీన్​ దయాల్ ఉపాధ్యాయ​ వర్థంతి సందర్భంగా భాజపాకు విరాళాలు ఇవ్వాలని అందరినీ కోరుతూ ప్రధాని ట్వీట్​ చేశారు. తన వంతుగా 1000 రూపాయలు విరాళం ఇచ్చినట్టు ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేశారు.

దీన్​ దయాల్​ ఎందరికో స్ఫూర్తి...

దయాల్​ వర్థంతి రోజున ఆయన దేశానికి చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. దయాల్​ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, కార్యకర్తలను ముందుండి నడిపించారని ట్వీట్​ చేశారు. తన జీవితాన్ని దేశాభివృద్ధికి అంకితమిచ్చారని దయాల్​ను కీర్తించారు మోదీ.

ABOUT THE AUTHOR

...view details