రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శుక్ర , శనివారాల్లో రాష్ట్రానికి రుతుపనాలు రాబోతున్నట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పేర్కొంది. ఇప్పటికే రావాల్సిన నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్న కారణంగా.. పక్షం నుంచి సరైన వానలు పడక ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని RTGS తెలిపింది.
చల్లని కబురు.. 2 రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు
రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది.
కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. రుతుపవనాల రాక కారణంగా రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 43 నుంచి 45 వరకు ఉంటోన్న ఉష్ణోగ్రతల తీవ్రత.. మెల్లగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.