నేడు గుంటూరులో ప్రధాని మోదీ పర్యటనకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులెవరూ హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. మొదటగా మంత్రి శిద్దాను కార్యక్రమానికి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. అనంతరం తాను ప్రధాని కార్యక్రమానికి వెళ్లటం లేదని అధికారులకు మంత్రి తెలియజేశారు.
గవర్నర్ నరసింహన్ తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని గుంటూరుకు రానున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా విశాఖలో చమురు నిల్వల కేంద్రంతో పాటు రాష్ట్రంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని కేరళకు పయనం కానున్నారు.