ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

4గంటల పాటు విమానాశ్రయంలోనే మోదీ - డెహ్రాడూన్

ప్రధాని నరేంద్రమోదీ భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్ జోలీగ్రాన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఫలితంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఆలస్యం.

By

Published : Feb 14, 2019, 4:40 PM IST

ఉత్తరాఖండ్​లో అనధికార పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ దాదాపు 4 గంటలపాటు విమానాశ్రయంలోనే గడపాల్సి వచ్చింది. రుద్రపూర్​ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన డెహ్రాడూన్ జోలీగ్రాన్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. నాలుగు గంటల తరువాత పరిస్థితి మెరుగుపడిన అనంతరం ఆయన బయటికొచ్చారు.

మోదీది అనధికార పర్యటన కావడం వల్ల ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్​ బేబే రాణి మౌర్య గానీ, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ గానీ విమానాశ్రయానికి రాలేదు.

రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులతో పాటు, రుద్రపూర్​లోని ఉద్ధమ్​సింగ్​ నగర్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్​ కోఆపరేటివ్ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్​(ఐసీజీపీ)ని మోదీ ప్రారంభించాల్సి ఉంది. దేశంలోనే తొలిసారిగా రూ.3,400 కోట్లతో నిర్మిస్తున్న ఐసీజీపీ వల్ల వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

అలాగే ప్రధాని మోదీ 'దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ రైతు సంక్షేమ పథకం' లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం కార్బెట్​ పులుల సంరక్షణా కేంద్రాన్ని సందర్శించనున్నారు.

ఉత్తరాఖండ్​లోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షంపడే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details