ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మందుబాబులకు శుభవార్త, మార్కెట్​లోకి కొత్త పానీయం - hangover drink launch

మందుబాబులకు శుభవార్త. రాత్రి పూటుగా మద్యంతాగి ఉదయాన్నే తలపట్టేసి బాధపడుతున్నారా? పరిమితికి మించి తాగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని దిగులు చెందుతున్నారా? ఇక వాటికి చెక్​పెట్టేయండంటూ మార్నింగ్​ ప్రెష్​ డిటాక్స్​ డ్రింక్స్​ విఫణిలో సందడిచేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీ తాజాగా భాగ్యనగర వాసులకు ఈ పానీయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

hangover_drink_launc

By

Published : May 15, 2019, 11:51 PM IST

మందుబాబులకు శుభవార్త

మద్యం ప్రియుల్ని ఉదయాన్నే హ్యాంగోవర్​ నుంచి బైటపడేసే మార్నింగ్​ ప్రెష్​డిటాక్స్​ డ్రింక్​ భాగ్యనగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులు ఇప్పటికే చెన్నై, ముంబాయి విఫణుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధుల తెలిపారు.

మద్యం సేవించిన తర్వాత చివరిగా దీన్ని తాగడం వల్ల కాలేయంపై చెడుప్రభావం పడకుండా కాపాడుతుందని సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. మద్యం మత్తు వదిలించుకునేందుకు ఇంట్లో చేసుకునే నిమ్మకాయ, పెరుగు వంటింటి వైద్యంతో పోలిస్తే కాస్త ఖరీదైనదే. అన్ని మద్యం దుకాణాల్లోను, అంతర్జాల మార్కెట్​లోనూ, ఈ-కామర్స్ ​దుకాణాల్లోను అందుబాటులో ఉంచామని కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు.

ఇదీ చదవండి: 86వ అంతస్తుకు మెట్లపై పరుగు- పదోసారీ గెలుపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details