ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఆ కేంద్రాలను దక్కించుకోవాలనే.. రీపోలింగ్​' - ap latest news

రాష్ట్ర సీఎస్​ భాజపా, వైకాపాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ..ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో రీపోలింగ్​ కావాలని తెదేపా కోరినా..ఈసీ విస్మరించిందని అమరావతిలో ఆక్షేపించారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మపోరాటమని..ఆ దారిలోకి సీఎస్​ సుబ్రహ్మణ్యం రావాలన్నారు.

బుద్ధా వెంకన్న

By

Published : May 17, 2019, 9:33 PM IST

మా ఫిర్యాదులెందుకు పట్టించుకోరు..!
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్​ నిర్వహించడంపై..ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. భాజపా-వైకాపాలకు అనుకూలంగా సీఎస్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ కేంద్రాలను ఎలాగైనా దక్కించుకోవాలనే నాటకమాడుతున్నారని ఆక్షేపించారు.

'భాజపా అవినీతి సొమ్ముతో వైకాపాకు సహాయం చేస్తోంది. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష పార్టీ చంద్రగిరి నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. మేం నెల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో రీపోలింగ్​ చేయాలని ఈసీకి చెప్పాం. మా ఫిర్యాదులను ద్వివేది పక్కనబెట్టారు. వైకాపా ఫిర్యాదు ఇచ్చిన 25 రోజుల తర్వాత చర్యలు తీసుకోవడం ఏంటీ..?. ఇది పక్షపాతం కాదా..!. ఈసీ రాజ్యంగబద్ధంగా వ్యవహరించడం లేదు. సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాటానికి సీఎస్​ సహకరించాలి'
---- బుద్ధా వెంకన్న, ఎమ్మెల్సీ.

ABOUT THE AUTHOR

...view details