ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'గడప గడప'లో మహిళల నిరసన.. ఎమ్మెల్యే తిట్ల పురాణం - women who deposed MLA Umashankar

Gadapa Gadapaku Program: ప్రభుత్వ పథకాలు అందడం లేదని నిలదీసిన మహిళలపై.. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. కావాలనే గొడవ చేస్తున్నారంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు వెనకుండి నడిపిస్తున్నారంటూ దూషణలకు దిగారు. ఇదే అదునుగా రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు... మహిళలపై దాడులతో వీరంగం సృష్టించారు.

mla uma shanker abused woman
mla uma shanker abused woman

By

Published : Jun 7, 2022, 5:48 PM IST

Updated : Jun 7, 2022, 6:59 PM IST

MLA Uma Shankar in gadapa gadapaku program: ప్రజాసమస్యలు పరిష్కారం కోసమంటూ చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేటలో రణరంగంగా మారింది. స్థానిక ఆలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్ నిర్వహించిన కార్యక్రమంలో.. మహిళలు వివిధ సమస్యలను ఏకరవు పెట్టారు. అమ్మఒడి పథకం అందడం లేదని ఎమ్మెల్యేకి వివరించారు. అడుగుతున్న వారంతా తెలుగుదేశం వర్గీయులేనని స్థానిక వైకాపా నాయకులు చెప్పడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్ సహనం కోల్పోయారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ప్రోద్బలంతో తెలుగుదేశం నాయకులే మహిళలతో గొడవ చేయిస్తున్నారంటూ తిట్ల దండకం అందుకున్నారు.

అంతటితో ఆగకుండా తెదేపా నేత అయ్యన్నను, తనను నిలదీసిన వారిని... ఎమ్మెల్యే ఉమాశంకర్‌ తీవ్రస్థాయిలో దూషించారు. ఈ వ్యాఖ్యల పట్ల నిరసన తెలిపిన మహిళలపై... ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మరింత దురుసుగా వ్యవహరించారు. తనను ప్రశ్నించిన వారిపైకి దూసుకొచ్చారు. మరోసారి బూతులతో రెచ్చిపోయారు.

ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఉమాశంకర్​ గణేశ్​

ఇదీ చదవండి:

Last Updated : Jun 7, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details