ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేరస్తుల ఫిర్యాదుకే హక్కుల్ని కాలరాస్తున్నారు: దినకర్ - undefined

నేరస్థులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించటం చూస్తే ఎన్నికల సంఘం పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ సందేహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాల్లో ఎన్నికల సంఘం భాగస్వామ్యమైందా అనే అనుమానం వస్తుందని ఆరోపించారు.

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

By

Published : Mar 28, 2019, 2:03 PM IST

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్
పలు కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేస్తే.... వివరణతీసుకోకుండా అధికారులపై ఎలా చర్యలు తీసుకుంటారని లంకా దినకర్ ప్రశ్నించారు.ఫారం-7 కింద దరఖాస్తులు పెట్టింది తామేనని బహిరంగసభలో జగన్‌ ఒప్పుకున్నా...నకిలీ ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నిజాయతీగా పనిచేస్తున్న అధికారులను వైకాపా నేతలు చెప్పారని బదిలీలు చేయిస్తారా అని దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై సిట్‌ నివేదిక వెలువడే సమయంలో అధికారి బదిలీ సబబేనా అని లంకా దినకర్‌ ఎన్నికల సంఘాన్ని అడిగారు. భాజపా పాలిత జార్ఖండ్‌లో ఇంటెలిజెన్స్ డీజీ... ఎమ్మెల్యేల కొనుగోలులో పట్టుబడినా చర్యల్లేవు అని గుర్తు చేసిన దినకర్‌..ఈసీ స్వతంత్రంగా పనిచేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details