ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పథకాలు ప్రతిఇంటికీ చేరాలి: మంత్రి బుగ్గన - buggan rajendrareddy

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలులో పర్యటించారు. కర్నూలులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థల సభ్యులపై ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

సంక్షేమ పథకాలు అర్హులకు చేర్చే బాధ్యత స్థానిక సంస్థలదే : మంత్రి బుగ్గన

By

Published : Jun 19, 2019, 10:54 PM IST

సంక్షేమ పథకాలు అర్హులకు చేర్చే బాధ్యత స్థానిక సంస్థలదే : మంత్రి బుగ్గన


రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసి, వాటి అధికారాలను కాపాడుతామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను స్థానిక సంస్థలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో నిర్మిస్తోన్న అక్రమ కట్టడాలపై సమావేశంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details