రాష్ట్ర మంత్రులంతా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సచివాలయంలోని తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి..శాఖల వారీగా ప్రాధాన్యత గల దస్త్రాలపై తొలి సంతకం చేశారు.
ఆర్థిక వ్వవస్థను గాడిన పెట్టాలి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి..హామీల అమలు చేసేలా ఆర్థిక పర కేటాయింపులు చేయడమే తమ లక్ష్యమని... ఆర్థిక , శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వ్యవస్థలో పారదర్శకత తో కూడిన నూతన విధానాలు తీసుకువస్తామన్నారు. సచివాలయం లోని 2 వ బ్లాక్ లో తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు. త్వరలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున.. ప్రతిపాదన దస్త్రంపై తొలి సంతకం పెట్టారు. నవరత్నాల హామీల అమలుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ
రెవెన్యూశాఖ మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. భూసేకరణలో మార్కెట్రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. భూముల రీ సర్వే చేయిస్తామన్నారు.
బాధ్యతలు చేపట్టిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కొత్త స్టడీ సెంటర్స్ దస్త్రంపై విశ్వరూప్ తొలి సంతకం
సచివాలయం 4వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ బాధ్యతలు స్వీకరించారు. 8 జిల్లాలలో స్టడీ సెంటర్స్ అందించే ఫైల్ మీద తొలి సంతకంచేసారు. మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పని చేస్తానని స్పష్టంచేశారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా మంచి శిక్షణ ఇస్తామన్నారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.
బాధ్యతలు చేపట్టిన విశ్వరూప్ రజకులు, నాయి బ్రాహ్మణులకు 10వేల సాయం
బీసీసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలుస్వీకరించిన శంకర నారాయణ. బీసీసంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంకట్టుబడి ఉందని... నవరత్నాలలోనూ వారికి పెద్దపీట వేస్తున్నామన్నారు. నాయిబ్రాహ్మణులు, రజకులకుసాయం ప్రతిపాదనలపై ఆయన తొలి సంతకం చేశారు. 80 వేలమందినాయి బ్రాహ్మణులకు రూ.10వేల చొప్పున సాయం చేయనున్నారు. 2.10 లక్షలమంది రజకులకు రూ.10 వేలచొప్పున సాయం అందిస్తారు.
శంకర్నారాయణ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి గృహ నిర్మాణ మంత్రిగా రంగనాథరాజు
చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి ఛాంబర్‌లో అడుగు పెట్టారు. నవ రత్నాలలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 175 నియోజక వర్గాలలో 100శాతం గృహాలు నిర్మిస్తామన్నారు. ఉగాది నుంచి ప్రారంభించి దశల వారీగా 25లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన శ్రీ రంగనాథ రాజు మద్యపాన నిర్మూలనే లక్ష్యంగా..
ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు. మద్యపాన నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళతామని తెలిపారు. ఎందరో మహిళల జీవితాలు మద్యపాన మహమ్మారి వలన రోడ్డున పడ్డారన్నారు. అందుకే ఈ మద్యపానాన్ని సమూలంగ నిర్మూలించాలని నిర్ణయంతీసుకున్నామని తెలిపారు.
నారాయణ స్వామి- ఎక్సైజ్ శాఖ మంత్రి ఇవీ చదవండి...మంత్రివర్గ కూర్పులో జిల్లా నుంచి ముగ్గురు