ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'నిష్పక్షపాత, అవినీతిరహిత పాలన అందిస్తాం'

సీఎం జగన్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందించేందుకు అధికారులు సహకరించాలని మంత్రి పినెపే విశ్వరూప్ కోరారు. కాకినాడలో జరిగిన అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందిస్తాం : మంత్రి పినెపే విశ్వరూప్

By

Published : Jun 26, 2019, 6:03 PM IST

Updated : Jun 26, 2019, 6:25 PM IST

నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందిస్తాం : మంత్రి పినెపే విశ్వరూప్
రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్​లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినెపే విశ్వరూప్, కురసాల కన్నబాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి విశ్వరూప్...నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. జిల్లాలోని సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి : బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..?

Last Updated : Jun 26, 2019, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details