ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'జగన్ నేరచరిత్ర అందరికీ తెలుసు' - nakka anand babu

హత్యారాజకీయాలు చేసే అలవాటు జగన్​ది. బాబాయ్ మరణాన్ని రాజకీయలబ్ధికి వాడుకుంటున్నారు. - నక్కా ఆనందబాబు, రాష్ట్రమంత్రి

నక్కా ఆనందబాబు

By

Published : Mar 15, 2019, 10:06 PM IST

ప్రతిపక్షనేత జగన్ మరో కొత్త నాటకానికి తెరతీశారని మంత్రి నక్కా ఆనంద​బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడిన ఆయన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యను రాజకీయలబ్ధికి వాడుకునేందుకు చూస్తోన్నారని విమర్శించారు. సీట్ విచారణలో జగన్ కుట్రలన్నీ బయటపడతాయన్నారు. జగన్ నేరచరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకా హత్యను దగ్గనుండి చూసినట్లు జగన్ చెబుతున్నారు. వివేకానందరెడ్డిపై గతంలో జగన్ చేయిచేసుకున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. మొదట్నుంచీ జగన్ తీరును వివేకా వ్యతిరేకించేవారని మంత్రి అన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేళా మాట్లాడుతున్నారని ఆనందబాబు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details