ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మార్కెట్ కమిటీల్లో రైతులకే ప్రాధాన్యం: మంత్రి మోపిదేవి - secretariat

రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాల నియామకాలను త్వరలోనే ప్రారంభిస్తామని పశుసంవర్దక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. మార్కెట్​లో ఈ-నామ్​ తీసుకొచ్చి దళారీ వ్యవస్థలను నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించేలా చర్యలు

By

Published : Jun 27, 2019, 6:59 AM IST

Updated : Jun 27, 2019, 7:17 AM IST

వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో మార్కెటింగ్ శాఖ పని తీరును పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్​ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు బుధవారం సమీక్షించారు. నూతనంగా నియమించే మార్కెట్ కమిటీలన్నింటలోనూ రైతులకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా 50% మార్కెట్ కమిటీల నియమాకాల్లో ఎస్సీ, ఏస్టీ, బీసీ, మైనార్టీలకు కమిటీల్లో పాధాన్యం ఇస్తామన్నారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీల ప్రకారం రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకై 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. అన్ని క్రియాశీలక మార్కెట్ యార్డులలో ఈ-నామ్ ద్వారా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తద్వారా రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను ఆధునీకరిస్తామని.. ఈ పర్మిట్ విధానం ద్వారా అనధికార రవాణా, చెక్ పోస్టుల వద్ద అవినీతి నివారిస్తామన్నారు. కేంద్ర మార్కెట్ నిధుల (సీఎమ్​ఎఫ్) కింద పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Last Updated : Jun 27, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details