ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత: మంత్రి ధర్మాన - మంత్రి కృష్ణదాస్

శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కృష్ణదాస్, అధికారులు పాల్గొన్నారు. 2కె రన్​లో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత : మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Jun 22, 2019, 11:46 PM IST

విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత : మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఆరోగ్యకర జీవనం, క్రమశిక్షణకు క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే 2కె రన్​లో మంత్రితో పాటు కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, అధికారులతో కలిసి మంత్రి...శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి నుంచి ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ మైదానం వరకు 2కె రన్‌ చేశారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు ఆరోగ్యం లభిస్తుందన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా తల్లితండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. చిన్ననాటి నుంచి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details