ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి - icds

విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల నిర్వహణపై మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖలో సమీక్ష నిర్వహించారు. పథకాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న మంత్రి వాటిపై సమగ్ర నిర్వహణ జరపాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు

By

Published : Jun 21, 2019, 7:00 AM IST

విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు
విశాఖ కలెక్టరేట్​లో మంత్రి అవంతి శ్రీనివాసరావు...గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొనారు. ఎమ్మెల్యేలు బుడి ముత్యాల నాయుడు, గోళ్లబాబు రావు, కన్నబాబు, అదీప్ రాజ్, ఉమ శంకర్ గణేష్, గుడివాడ అమర్​నాథ్​లు సమావేశానికి హాజరయ్యారు. ఐసీడీఎస్, ఆర్.ఎ.సి.ఎస్, సర్వశిక్ష అభియాన్, గనులు, మధ్యాహ్న భోజన పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని వాటినిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖ నగరంలోని సిటీ సెంట్రల్ పార్క్, విమ్స్​లకు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని తీర్మానించారు. మండలాలు వారీగా అభివృద్ధి, పెండింగ్ పనుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details