ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గడ్చిరోలి బాంబుపేలుడు కేసులో నిందితుల అరెస్టు

By

Published : Jun 12, 2019, 12:00 PM IST

Updated : Jun 12, 2019, 3:30 PM IST

మహారాష్ట్ర గడ్చిరోలి బాంబుపేలుడు కేసులో కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఇద్దరిపై చాలా కేసులున్నాయి. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వీరిని అరెస్టు చేశారు.

mavo

మహారాష్ట్ర గడ్చిరోలి బాంబుపేలుడు కేసులో కీలక నిందితులు కిరణ్, నర్మదను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వీరిని అరెస్టు చేశారు. వీరిద్దరిపై కోటికిపైగా రివార్డు ఉంది. నర్మదపై పలు పోలీసుస్టేషన్లలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులను హతమార్చినవే 40కిపైగా కేసులు వీరిద్దరిపై ఉన్నాయి. మావోయిస్టులు కిరణ్‌ దంపతుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడగా పోలీసులు తెలిపారు. గత నెలలో మహారాష్ట్రలో జరిగిన పేలుళ్ల వెనక కిరణ్‌ దంపతుల హస్తం ఉన్నట్లు వెల్లడించారు. దండకారణ్యంలో వెస్ట్‌ సబ్‌ జోనల్‌ కమాండ్‌కు సెక్రటరీగా నర్మద వ్యవహరించారు. దండకారణ్య జోనల్‌ కమిటీకి కిరణ్‌ దంపతులు సభ్యులుగా ఉన్నారు. భార్యతో నర్మదతో కలసి కిరణ్... 20 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగుతున్నారని తెలిపారు .

కిరణ్
నర్మదను
Last Updated : Jun 12, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details